Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీలోనీలో నేనుండాలని
నీ తోనే ఈ పయనం సాగాలని
నా మనసే కోవెలగా మలచుకొంటిని
నా స్వామిగా నీ మూర్తిని నిలుపుకొంటిని
1 వ చరణం
కొడి గట్టిన ఈ బ్రతుకు ప్రభాతమై మెరవాలని
అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని
ఆ......ఆ.......ఆ......ఆ.........
వశివాడని ఈ యెదలో వసంతమై మెరిసావు
అమరలోక విందులో అమృతమై కురిసావు
2 వ చరణం
నీ పలుకు ధారలతో నిండిన ఈ హృదిని
నీ పూజ కు నియమించే పూవులతో వికసించనీ...
నీ ప్రేమగానం తో రాగాలు రవళించనీ........
నీ రాకకై ఎదురుచూచు నాతో ప్రతి అణువు.......
నా స్వామివి నీవేనని నీకోసం పరితపించనీ