Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిండు హృదయముతో నిర్మలమాతకు
నిరతము నీరాజనము వందనమర్పించెదం
ఆవే ఆవే మరియ
1 వ చరణం..
యావే పిలుపువిని శిరమునువంచి
దీనదాసిగా పావనాత్మకు వశమై
రక్షణయాగమున సజీవ సమిధగా
జీవార్పణచేసిన త్యాగమయి
2 వ చరణం..
సుతదేవుని వరముగా హృదయాన ధరించి
జీవితమంతా ప్రభునిబాటలో నడిచి
శిష్యలోకానికి ఆదర్శమై నిలచిన
అసమాన విశ్వాసి జగదేకసాధ్వి