Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నిండు మనస్సుతో నిన్నే కొలిచేము దేవా......
రెండు కనులతో నిన్నే నిలుపు కొంటిమయ్య
పండు వెన్నెలే మాకు నీ కిరణ కాంతి ||ని||
1. పరిపక్వమైన మా పాపాలనెల్ల బాపి
గురిలేని మా బ్రతుకున వెలుగు బాట చూపి
పరిశుద్దమైన నీ మోక్ష మార్గమందు నడిపి
దరి చేర్చి సంరక్షించు మా పాలిదైవమా ||ని||
2. నీ నీతి వాక్యములనే పాటింతుమయ్య
నీ వెలుగు జాడలలో పయనింతుమయ్య
నీ ఘనతనే జగతికి కీర్తింతుమయ్య
నీ చరణ దాసులమయ్యా పాలించరావయ్యా||2||