Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: ఆవే మరియా మా చల్లని మాత -
ఆవే మరియా బహు చక్కని మాతా
ఆవే మరియా ఆవే మరియా నినుపోలిన తల్లి మాకెవరమ్మా ||3||
ప : నిన్నే నే చూడాలి నీ ఒడిలో చేరాలి -
నీతో మాట్లాడాలి ఊరట చెందాలి
అమ్మా మా అమ్మా - అమ్మా మరియమ్మా
1. అనురాగం మమకారం నీకే సొంతం -
కారుణ్యం దీనత్వం నీకే అందం
నీలాంటి ఆదర్శం మాకెవరమ్మా -
మా వెంటే నీవుంటే అది చాలమ్మా
2 ప్రేమ ధనం త్యాగమయం నీ జీవితం -
కమనీయం రమణీయం నీ విశ్వాసం
లోకంలో నీవంటి అమ్మెవరమ్మా -
నీ మాటే మాకిలలో మురిపాలమ్మా