Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఓప్రభువా - 1
ప. నిను వెంబడింతును మరియ
నీ నీడ నిలుచును మాత
మానవ హృదయాలలో నీవు
మహిమను పొందితివమ్మా ||2|| ||నిను||
1 జన్మంబుతోడని అనఘాత్మురాలైన
నిర్మల మాతవు నీవే ||2||
నినుగన్న తండ్రిని ధరియించి కన్నట్టి
ధన్యాత్మురాలవు నీవే ||నిను||
2 ఏడేడే బాకుల ఎదనిండి పోయిన
వ్యాకుల భరితవే అమ్మా-ఉత్థాన పుత్రుని
మహిమలో నీవు మహిమాత్మురాలైతివమ్మా ||నిను||
3. పరలోక రాజ్ఞిగా పరమందు చేరిన ఓ పరిశుద్ద మరియా
పాపాత్ములగు మాదు మరణంబు వేళల మము బ్రోవ వేడుము ఆమెన్