Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిర్మల రాజ్ఞివమ్మా ఓ కన్యా - ఓ కన్యా దేవమాత ||2||
1 వ చరణం..
దైవకృప నొందితివే ` ధరనరులందరిలో
మెండుగ దేవుని వరముల శక్తి
నిలచే నీయందు ` నిలచే నీ యందు llనిర్మll
2 వ చరణం..
తండ్రికి పుత్రికవే సుతునికి మాతవమ్మా
ఆత్మకు పత్నిగ అమరుల రాజ్ఞిగా
వెలసినావమ్మా ` వెలసినావమ్మా llనిర్మll
3 వ చరణం..
శ్రీసభ పోలికవే ` నీతికి నిలయమువే ||2||
చేతుము ప్రణతుల్ ` జేసుని మాతా
చేకొనుమా యెదలన్ చేకొనుమా యెదలన్ llనిర్మll