Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-13
ప. నిన్ను వదలి బ్రతుకలేనయ్యా ||2||
యేసయ్యా యేసయ్యా
1. ద్రాక్షావల్లివి నీవైతివి-నీలోని
రెమ్మను నేనైతిని ||2||
తెగకుండ కాపాడుమా
యేసయ్యా యేసయ్యా ||2||
నీతోడు లేక నే నిలువలేను
నీవు లేక ఏం చేయలేను
2. నిన్ను విడచి పాపములోపడి
ఎండిన చెట్టువలె నశించితిని
చిలకరించు నీ రక్తము
యేసయ్యా యేసయ్యా. .. ||2||
చిగురించి మళ్ళీ జీవించెద
నీ జీవం పరులకు పంచగా
3. ముందు వెనుక నన్నుచుట్టి
నీ చేతులతో నడిపింతువు
నీ కృప చాలునయ్యా
యేసయ్యా యేసయ్యా ||2||
నా ముందు నడుచు ప్రభు నీవేగ ||నీ||