Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిరతం తవ పద- సేవయే శరణం
సతతం తవ శుభ – గానమే మధురం
1:-
ధర్మపు మర్మము – లెరుగని వారి
మనసున తమస్సు – హత మార్చు
ధర్మమూ నెరిగియు – మాంద్యము వీడని
మనుజుల మానసగతి మార్చు ||2|| ||నిరతం||
2:-
పరిధియే ఎరుగని – ప్రేమాభావము
ప్రగతి పధంబున – జగతిని నడుపు
విఫలము నెరుగదు మానవ యత్నము
విభుడవు ఘనుడవు తోడై నిలువు ||2|| ||నిరతం||
3:-
నీదౌ ఆజ్ఞల – ఔదలదాల్చి
ఆవనిలో వెలుగగ – దీవించు
నీ శుభ వాక్కులు – నిత్యము మాలో
సఫలత నివ్వగ కరుణించు ||2|| ||నిరతం||