Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నిన్ను విడువను యేసు ప్రభూ
నిను విడువగ లేను-ఎన్నడును నిను బాసి
ఏమి చేయగ జాలను ప్రభువా ||ని||
1. అనుదిన జీవితమును మది నెంచగ
అనుకొనని ఆపాయము లెన్నెన్నియో
నను సంధించగ నను బంధించగ ||2||
వెను వెంట నుంటివిగదా నా ప్రభువా ||ని||
2. నిను మరచి తిరుగుచు నే నుండిన
నీ సన్నిధి విడచి యెటు బోయిన
నను మరువకను మది నిడువకను
నన్నాదుకొంటివి గాదా నా ప్రభువా ||ని||
3. నీ మేలులన్నిటిని మదినెంచక
నీ ప్రేమామృతమును చవిచూడగ
నా మది భక్తితో నామది ప్రేమతో
ఉప్పొంగ పొరలితి రాదా నా ప్రభువా ||2||