Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసే నా గానం-1
ప. నిర్మలగిరిపైన వెలసిన మాతా
నిలిచామమ్మ నీ సన్నిధి ||2||
నిరతము నీ ప్రేమ మాపై కురిపింప ||2||
నిలిచావా నీవు నిర్మలగిరి పైన ||2||
1. తండ్రి చిత్తముకై తలవంచి
లోకరక్షకుని ఇలకందించితివి ||2||
తనయుని బాటలో నడచిన రీతిగా ||2||
మము నడిపింప దీవించు తల్లి ||2|| ||ని||
2. శిలువలో నాధునికి అండగా నిలచి
ఈభువి యందున ధాత్రిగా వెలసితివి ||2||
ఆ దివ్య సుగుణాలు మాకందించగా ||2||
నిర్మలమాతగా యిల వెలసితివా ||2|| ||ని||