Type Here to Get Search Results !

నిర్మలమైన నిర్మలగిరిపైన ( nirmalamaina nirmalagiripaina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నిర్మలమైన నిర్మలగిరి పైన 

అమరజ్యోతిగా వెలసిన మరియమ్మ ||2|| 

అమరుల రాజ్జిగ పరలోకములో

ఆసన్నమైన మా అమ్మ ||2|| 

అమ్మా ఓ నిర్మలగిరి తల్లి 

మమ్ము కావగ రావమ్మ ||2|| ||ని|| 


1. దూత సందేశ మందుకున్న

ఓ పావన మరియమ్మా 

సర్వోన్నతునికి తల్లిగ 

నీవే ఎన్నికైతివమ్మా 

అమ్మా ఓ నిర్మలగిరి తల్లి 

మము కావగ రావమ్మ ||2|| ||ని|| 


2. దావీదు గోత్రమున ఆణిముత్యముగ 

జన్మించితి వమ్మా 

అందరి తల్లిగ నుండగ

ప్రభుని నిచ్చెనుమాకమ్మ ||2|| 

అమ్మా ఓ నిర్మలగిరితల్లి 

మము కావగ రావమ్మ ||2|| ||ని|| 


3. ఉన్నత దేవుడు గొప్పకార్యములు

చేసేను నీకమ్మా 

సత్యసభయందు ఉన్నత స్థానము 

నీదే నోయమ్మా 

అమ్మా ఓ నిర్మలగిరి తల్లి 

మము కావగ రావమ్మ ||2|| ||ని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section