Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నా ప్రాణనాధుడా
ప. నిష్కళంక మాత - రక్షకుని మాత ||2||
మమ్మును కాచే మా దేవమాత ||2||
నీ పుత్రుడేసుని పుణ్య ఫలములనీయగా ||2||
దర్శన మిచ్చిన మార్గదర్శిని ||2|| ||ని||
1. లోకశాపాన్ని దేవుడు రూపు మాపుటకై
జన్మపాప రహితోద్భవిగా నిన్ను కలిగించెనుగా ||2||
దైవచిత్తమును నీవు శిరసావహించి ||2||
జగద్రక్షకునితో నీవు సహకరించితివమ్మా ||2|| ||ని||
2. రక్షణ చరిత్రలో రారాజుకు జనినివై ||2||
నిత్య కన్యగా నీవు నిలచినావమ్మ ||2||
దైవకృపను దండిగా పొంది ఆత్మశరీరంతో ||2||
మోక్షరాణివై నీవు వెలుగుచుంటివమ్మ ||2|| ||ని||