Type Here to Get Search Results !

నీతోడు నాకు కావాలి ( nithodu Naku kavali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Fr. Eruva Lourdhu 

Music: Duggirala 

Album: YESU LAALI - 3 


నీ తోడు నాకు కావాలి ప్రభువా 

నీ నీడలో సేద తీరాలి దేవా ||2|| 

నీ ప్రేమ నాలో విరియాలి ప్రభువా 

నీ కరుణ నాపై కురియాలి దేవా ||2|| 

జయ మంగళం నీకే శుభ మంగళం

జయ మంగళం దేవా శుభ మంగళం ||2|| 


1. నీవే లేని నా జీవనం 

నీరే లేని ఎడారి పయనం ||2|| 

తోడు నీడ నీవై నిలచి 

జీవజలమిచ్చి కాపాడవా ||2|| ||జ|| 


2 నీ దారి మరచి దరి చేరగలనా

నీ చేయి విడచి ఇల నిలువగలనా ||2|| 

నీ అడుగుజాడలే నా బ్రతుకు బాట 

నీవిచ్చు వరములే నా ముక్తి మార్గం ||2|| ||జ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section