Type Here to Get Search Results !

నీతోనే ఉండాలి నా స్వామీ ( nithone undali na swami Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీతోనే ఉండాలి నా స్వామీ... 

నీలాగ మారాలి ||2|| 

రేయింబవళ్ళు మేలుకొని 

నీ సన్నిధిలోనే నిలవాలి

స్వామీ నిన్నే నే స్తుతించాలి ||2|| 

జై జై... యేసురాజా...జైజై యేసురాజా ||2||

||నీతోనే|| 


1. ఈ లోక ప్రతిష్టయంత 

ధూళిగ మారాలి ||2|| 

నిన్నే నా దృష్టిలో నిలుపుకొని 

నీకై బ్రతకాలి...నీ సాక్షిగ మారాలి ||2||

జై జై... యేసురాజా...జైజై యేసురాజా ||2|| 

||నీతోనే|| 


2. నశించుపోవు ఆత్మలకై 

కన్నీటి ప్రార్ధన చేయాలి

ప్రతిక్షణం మేల్కొని ప్రార్ధించే 

కాపరిగా నే మారాలి... 

నీ రాజ్యము నే స్థాపించాలి

జై జై... యేసురాజా...జైజై యేసురాజా ||2|| . .

||నీతోనే|| 


3. నీ వాక్కును డాలుగ చేసుకొని 

ధర్మయుద్ధము జరపాలి ||2|| 

విశ్వాస ఖడ్గము చేపట్టి 

సైతానునే జయించాలి 

నీ మహిమనే ప్రకటించాలి

జై జై... యేసురాజా...జైజై యేసురాజా ||2|| . .

||నీతోనే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section