Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవే అమ్మా ఆరోగ్యమాతా
కరుణామయి జననీ ||2||
స్వర్గ కుమారుని పెంచిన మాతా
నీవేగా అందరికీ శరణం ||నీవే అమ్మా||
1. అమలోద్భవీ కరుణాంబికా పరిశుద్దమాతా
నీ దర్శనం ఈ వేళలో ఆనందమూ
నీ పాదమే మా రక్షణ ఓ మేరిమాతా
ఎల్లప్పుడూ మీ తోడనే జీవింతుమాతా
మీ దయ మాపై ఉంచు మరియా
రక్షణ భాగ్యం ఒసగుమమ్మా
నా జీవితాంతం నిన్నాశ్రయించి
జీవించు భాగ్యం ఒసగుమమ్మా
ఆవే మరియా ||3|| ||నీవే అమ్మా||
2. దుఃఖమైనా బాధయైనా ఓ మేరిమాతా
నీ సన్నిధి చేరాలని తాపత్రయం
నా గుండెలో నీ రూపమే నిలిచేను మాతా
నీ ప్రేమతో కరుణించవా ఈ వేళలో
దేవుని ఆత్మతో నిండిన మాతా
దేవుని వచనం నేర్పుమమ్మా
నీ సన్నిధానం చేరిన మమ్ము
ఆశీర్వదించి కావుమమ్మా
ఆవే మరియా ||3|| ||నీవే అమ్మా||