Type Here to Get Search Results !

నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా ( nive asha nive swasa nive dhyasa yesuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా

నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా 

తలచుదునే నాపై కురిసిన

నీ మధుర ప్రేమను 

నీ రూపులోనే నీ చేతి పనిగా 

నను నీవు మలచితివే 

నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై 

నను సృజియించితివే నీవే ఆశ


1 వ చరణం.. 

ఇహమున నాకొసగిన ఈ ధరయెంతో భాగ్యమని

తలచితి నే భ్రమచితి అంతయు నాకు సొంతమని

ఆశతో నేను పరిగిడితి ఇలలో చెలిమికై

ప్రతి హృదయం స్వార్ధమాయే 

ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి 

కలిగిన ఒక ప్రేమైన కానరాదే నీవే


2 వ చరణం.. 

హృదయము పులకించెను

నీ ప్రేమ స్పృశించగనే

ధృడమాయే నా మదిలో

ఇక అంతయు వ్యర్ధమని

నా జీవన గమనాన్ని నీ వైపు

నీ అడుగులలో నే నడచి

నీ కౌగిలిలో ఓదగుదునే 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section