Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవేనమ్మా ఓ మరియమ్మా -
నిఖిల జగములు కొలిచే తల్లివి
సకల శుభములు ఒసగే జననివి
నమస్తే నమస్తే నమస్తే
1. కోరిన వారికి కొండంత బలము -
ధరలో నీదు మహిూప కారము
వరముల నొసగే కరుణామయునివి -
పరమును చేర్చే మా పెన్నిధివి ||నీ||
2. ప్రాతఃకాలపు - ప్రభలను మించిన -
చల్లని సంధ్యా - కాంతుల కన్నను
హాయిని ఒసగే నీ శుభ సన్నిధి -
కమ్మని కరుణా వీక్షణ నయనా ||నీ||
3. బాధల భారము - మోయగ లేక -
నీ దరి చేరిన దీనులనెల్ల కాచెడి మా ప్రియ ప్రేమామయునివి -
దీవెన లొసగే దేవుని మాతా ||నీ||