Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవుంటే నాకు చాలు యేసయ్యా -
నీవెంటే నేను వుంటానేసయ్యా ||2||
నీమాట చాలయ్యా నీ చూపు చాలయ్యా-
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
1. ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ -
ఎంత కష్టమొచ్చిన నిష్టూరమైననూ ||2||
2. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ-
అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా
3. ఆస్తులన్నీ పోయినా అనాధగా మిగిలినా-
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా
4. నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యము-
నీదు కృపలో మాకేదియు కాదిల సమానము