Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవున్నావన్నావు నాతో ఉంటానన్నావు -
నాతోడై నిలిచావు నీ స్నేహం పంచావు
నా చేయిపట్టి నను లేవనెత్తి నీ మాట ఇచ్చి
నా మనసును గెలిచావు
1. కారు మబ్బులే కమ్మిన వేళ - చీకటి చింతలే చుట్టిన వేళ
కఠిన మాటలే తాకిన వేళ - కొండలవైపు నే చూచిన వేళ
నా చేయిపట్టి నను లేవనెత్తి - నీ మాట యిచ్చి నా మనసును గెలిచావు
ఘన దైవమా నా మణి దీపమా - నీ సేవలోనే నను కడతేర్చుమా
2. కోపపు ద్వేషముతో కుంగిన వేళ - పగల సెగలతో రగిలిన వేళ
నీ సన్నిధినే విడిచిన వేళ - నిన్ను విడిచి తిరిగిన వేళ
నా చేయిపట్టి నను లేవనెత్తి నీ మాట యిచ్చి నామనసును గెలిచావు
ఘన దైవమా నా మణిదీపమా - నీ సేవలోనే నను కడతేర్చుమా