Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీవుంటే నాకు చాలు యేసయ్య ..
నీవెంటే నేను ఉంటా యేసయ్య ||2||
నీ మాట చాలయ్య-నీ చూపు చాలయ్య
నీ తోడు చాలయ్య-నీ తోడు చాలయ్య
1. ఎన్ని బాధలున్ననూ-ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన-నిష్టూరమైనను ||2|| ||నీ||
2. బ్రతుకునావ పగిలినా-కడలిపాలైననూ
అలలు ముంచివేసిన ఆశలు అణగారినా. ||2|| ||నీ||
3. నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ
నీదు కృపతో నాకేదియూ కాదిక సమానము ||2|| ||నీ||