Lyrics: శాంతయ్య
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -9
నీవే శరణం అంతోని వారా నీవే అభయం అంతోని వారా ||2||
అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోనివారా! ||2||
అంతోనివారా! మా అంతోనివారా! ||2||
1) పోయిన వస్తువు దొరికించువారా! మాయని గాయం
మరిపించువారా రోగుల బాధలు తొలగించువారా
నెమ్మది తనమును నేర్పించువారా! ||2|| ||అంతోనివారా|| ఆ........... ||2||
2) ప్రేమతో మమ్ము పాలించువారా ప్రార్ధన దయతో ఆలించువారా ||2||
దీనుల హీనుల దీవించువారా ప్రాణులనన్నీ ప్రేమించువారా! ||2|| ||అంతోనివారా|| ఆఆఆ...ఆఆఆ
3) దీవెనలెన్నో అందించువారా! జీవనగమనం చూపించువారా ||2||
స్వస్థతలెన్నో కలిగించువారా స్వాంతనకూర్చి పంపించువారా! ||2|| ||అంతోనివారా||