Type Here to Get Search Results !

నీవు నడచిన పుణ్యభూమి ( nivvu nadachina punyabhumi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Johnson Chettur 

Tune: Rev. Bishop Poola Anthony 

Music: Thyagarajan 

Album: స్వరాభిషేకం 


ప. నీవు నడచిన పుణ్యభూమి 

పరమ పావనం దేవా పరమ పావనం 

కరుణ కురిసే నీ పలుకే మధుర భావనం 

దేవా మధుర భావనం

నా జీవం నా సర్వం నామోక్షం నీవే 

నా ధ్యానం నా గానం నా గమ్యం నీవేనీ 


1. కానాపల్లెలో నీటిని రసముగ 

మార్చిన సద్గురుదేవా ||2|| 

కనులకు వెలుగై నడకలు నేర్పి

ప్రేమను కురిపించితివి 

నువు చూపిన త్యాగ నిరతికి

నింగి మోకరిల్లే 

నిన్ను మోసిన మరియతల్లికి 

జన్మధన్యమాయే ||నీ|| 


2. అష్ట భాగ్యములు జీవన విలువలు 

నేర్పిన మధుర స్వరూప ||2|| 

శిష్యుల ముందర స్వర్గ ప్రవేశము 

చేసిన దేవకుమారా 

నీ పదములను తాకిన కలువరి 

ధన్యమాయె తండ్రి 

మా విశ్వాసం మా ఉచ్చ్వాసం

నీవే నా స్వామి ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section