Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా ll2ll
దావీదు కుమారుడా- నను దాటిపోకయా
నజరేతు వాడా- నను విడచి పోకయా ll2ll
llనీవుll
1 వ చరణం..
గుడ్డి వాడినయ్యా- నా కనులు తెరువవా
మూగ వాడినయ్యా- నా సర్వము నీవయా
కుంటి వాడినయ్యా నను కరుణించవా ll2ll llదావీదుll
2 వ చరణం..
లోకమంత చూసి నను ఏడిపించగా
నీ జాలి తో నన్ను చేరదీసినా
ఒంటరి నయ్యా నా తోడు నిలువవా ll2ll llదావీదుll
3 వ చరణం..
సాతాను వలలో నేను చిక్క యుండగా
నీ ప్రేమతో నన్ను చేరదీసిన ll2ll
బలహీనుడనయ్యా- శక్తినీయవా ll2ll
llదావీదుll