Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పశ్చాత్తాపము చెందిన మనసును
నిరాకరింపవు ప్రభువా నీవు
1 వ చరణం..
కరుణామయుడవు నీవే కనుక
మాపై కరుణను చూపుము ప్రభువా
దయగల దేవుడు నీవే గనుక
దోషాలన్ని బాపుము ప్రభువా
2 వ చరణం..
పాపిని నేనని గుర్తించాను
కనులలో పాపము కదలాడెను
నీకే ద్రోహం చేసా స్వామి
చెడు పనులన్నో చేసా ప్రభువా
3 వ చరణం..
నిర్మలహృదయం సృజించు నాలో
స్థిరమగు ఆత్మను నిలుపుము
నాలోనీ నుంచి నను త్రోసివేయకు
నీ పవిత్రాత్మను తీసివేయకు