Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాపపు భారము మోయుటకై
ప్రాణము వీడిన ఓ ప్రభువా
నీ పాదము పట్టితినో ప్రభువా-
సాదరమున నన్నాదరించు
1. అల్పుడ నేను అనర్హుడ నేను -
సృష్టిలో నేనొక పరమాణువును
నీవేనయా నే నమ్మిన దైవం -
ముక్తిని పొందగ చేయుమయా
నా శక్తివి నీవై నడుపుమయా -
సాదరమున నన్నాదరించు
2. అంధుడనై పాపాంధుడనై -
బంధములన్ని నే మరచితిని
నీవేనయా నా జీవన తీరం -
జీవన పథమును చూపుమయా
నిర్జీవుల నిండుగ కావుమయా -
సాదరమున నన్నాదరించు