Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: స్వాగతమో దేవా
ప. పాడెదము ప్రభు నీ స్తుతి గీతం
నీ సన్నిధిలో ఈ వేళ
ఇమ్మానుయేలుడా జీవనాధుడా
కీర్తించి నిను భజియింతుం ||పా||
1. జీవన నావకు మార్గమని
ప్రతి జీవికి రక్షణ నీవేయని ||2||
ఓ మరియ తనయుడా ప్రేమరూపుడా ,
ఓ మరియ తనయుడా ప్రేమరూపుడా
కీర్తించి కొనియాడెదము
నిను కీర్తించి కొనియాడెదము ||పా||
2. మనలను సుఖమను మార్గములో
మధురముగా నడిపించునని ||2||
ఓ జీవ నాధుడా ప్రాణ దేవుడా
కీర్తించి ప్రణుతించెదము
నిను కీర్తించి ప్రణుతించెదము ||పా|| 3. పరమున చేరగ – ద్వారమని
పరమొందగ జీవపు - బాటయని ||2||
జీవమార్గమా - ప్రేమ దీపమా ||2||
కీర్తించి - వినుతించెదము
నిను కీర్తించి ప్రణుతించెదము ||2||llపాll