Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పాదాలు నే కడుగనా
యేసు పాదాలు నే కడుగనా
కన్నీటితో కడిగి పన్నీరు పూయన
నన్నేలు స్వామికి నా జీవ నాధునికి
1. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు
నా కొరకు లోకాన ఉదయించెను ||2||
నరాకాగ్ని నుండి నన్ను రక్షించెను ||2||
పరలోక భాగ్యం నాకిచ్చెను ||2|| ||పా||
2. పాపాల సుడిగాలి పాలైతిని కడకు
శాపాల సంద్రములో పడిపోతిని ||2||
నా యేసు ప్రేమతో దరి చేర్చెను ||2||
నూతన జీవము నా కొసగెను ||2|| ||పా||