Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 7
పర్వతాలు కూలినా - కొండలే కదిలినా
నీ శాశ్వత ప్రేమ - నన్ను వీడిపోదు
ఒక్క క్షణమే నన్ను విడిచినా -
కలకాలము నాతో ఉందువు యేసయ్యా
నీకే మహిమ - నీకే ఘనత ఆరాధన యేసయ్యా
నీకే మహిమ - నీకే ఘనత, ఆరాధన
1. ప్రభువా నా కాపరి - ప్రభువా నా ఊపిరి (2)
నాకింక కొదవేమిటి నీ దూత
నాచుట్టూ - శిబిరము
పన్ని కాపాడుచున్నాడులే (2)
నా బలము, ధనము, ఘనము నీవే నీవే (2)
నా మార్గము, సత్యము, జీవము నీవే నీవే (2) ||ఒక్కక్షణ||
2. ప్రభువా.ఆధారమా - ప్రభువా ఆనందమా (2)
నా మధుర వాక్యమా - నా రాకపోకలలో
ఎల్లప్పుడుండి - కాపాడు చున్నావులే (2)
నా తోడు, నీడ, గూడువు నీవే నీవే (2)
నా ఆశ, శ్వాస, బాసవు నీవే నీవే (2) ||ఒక్కక్షణ||