Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరుగిడుచుంటిని
పరమ సియోనులో నా ప్రభుని చేరా ||2||
వెనుకకు చూడక ముందుకు సాగుచూ
పరుగిడుచుంటిని పరుగిడుచుంటిని ||ప||
1: రాళ్లతో కొట్టి బహుగా హింసించినను
ఆ పాపము వీరిపై మోపకు అని వేడి ||2||
వేద సాక్షిగా సైఫను
పరమును చేరిన రీతినా . ||2||
నా ప్రభునీ చేర పరుగిడుచుంటిని ||ప||
2. సౌలు పౌలుగా మారి
గతమంతా వదిలి దివిలో
ప్రభుని చేర ధ్యేయముగా నడచి ||2||
ఇహలోక పరుగు తుద
ముట్టించిన రీతినా ||2||
గమ్యము చేర పరుగిడుచుంటిని ||ప||
3. కారణ విలుని కాలిడ వచ్చిన కటిక
చీకటి నన్ను వరించినా ||2||
అధైర్య పడక అలసట చెందక ||2||
నా యేసు నిను చేరి పరుగిడుచుంటిని ||ప||