Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి. అడగక ముందే అక్కర లెరిగి -అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే-బంధాలను పెంచిన భాగ్యవంతుడా
ప: పదే పదే నేను పాడుకోనా - ప్రతిచోట నీ మాట నా పాటగా
మరీ మరీ నేను చాటుకోనా -మనసంత పులకించ నీ సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే - చితికిన నా గుండెకు రాగం నీవే
మమతల మహారాజా- యేసురాజా - మమతల మహారాజా - నా యేసురాజా
1. అడగక ముందే అక్కర లెరిగి -
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే -
బంధాలను పెంచిన భాగ్యవంతుడా
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా-
బంధాలను పెంచిన భాగ్యవంతుడా
2. అలిగిన వేళ అక్కున చేరి -
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నాదరిచేరి -
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
అనురాగం పంచిన అమ్మవు నీవే -
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే