Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1:- పాలకుడవనీ నిన్ విడువకనీ-పంచ చేరితిని స్వామి
జాల మేల నింక నిన్ను
నేలుకొన రమ్ము భక్త – జాల సుగుణాల వాల ||పాల||
2:-
ప్రాపునీవని నమ్మితిని నా – పాప మెడబాపి
తేప తేపకు నీదు నెలవును – జూపకుండిన నోపజాల
కోపమేల దాపు గమ్ము ||పాల||
3:-
ఎంత వేడిన నీ మదికి నిసు – మంత దయలేదా!
ఎంత పాపులమైన నీదగు – చెంత జేరినాము మా
చింత లెడ బాపి బ్రోవు ||పాల||