Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప :పాలించు పాలించు జోజప్ప -
ప్రాపకుడై మము పాలించు
దీవించు మామీద కోపించవద్దయ్య -
భూషించు మీపాద మాశించు జనులను
1 వ చరణం..
మాయ పిశాచులు వేయు వలలో జిక్కి -
మతిదప్పి నడవక మముగాచు జోజప్పా
తీయని పగగొని చేయు తంత్రములను -
తెగగొట్టి రక్షించు దినమునుజోజప్పా
2 వ చరణం..
దేవర తల్లికి దివ్య చిత్తమువల్ల -
తెలిసికొన బడినట్టి పరిశుద్ధ జోజప్పా
కావలిగా నుండి కరుణతో మా పురమున్-
కనిపెట్టి రక్షింప పరిశుద్ధ జోజప్పా
3 వ చరణం..
కాలవానలు లేక నేలలు చెడకుండ -
కరుణతో ప్రార్ధించు కర్తను జోజప్పా
శీలమె వర్తించి చెబ్బరులు లేకుండ -
జనులకు దయజేయ చిత్తగించు జోజప్పా
4 వ చరణం..
తీరని రోగము లారని గాయముల్ -
చేరకుండ మమ్ము నాదరించు జోజప్పా
దూరిన శత్రువు దూరమై పోవగ -
దుఃఖపడు వారికి తోడగు జోజప్పా