Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసుని చూడాలని
ప. పాలస్తీనాలో యేసు స్వరం వినిపించే
స్వరం వినిపించే స్వరం వినిపించే
స్తుతించు జనులారా వేదన విడువరా
స్తుతించు ప్రజలారా చెరలోనున్నవారా
నా చెంతకు రండి, విశ్రాంతి పొందా
నా యొద్దకు రండి ఆనందం పొందా ||పా||
1. బర్తమయికి దృష్టినొసగి, పక్షవాతరోగికి
ఆరోగ్యంనిచ్చి మరణించిన
లాజరుకు జీవము పోసిన
మూగవానికి మాటనిచ్చిన
దావీదు తనయా ఏసురాజా
రోగినై నేనునుంటున్నా
నీదివ్య హస్తముతో నన్ను తాకి
స్వస్థత పరుచుమా దైవసుతా ||స్తు||
2. పశ్చాత్తాప పడిన దొంగకు
నీవు పరలోక భాగ్యమును అనుగ్రహించావు
పాపియైన స్త్రీని ప్రేమతో క్షమించావు
సమరియా స్త్రీకి జీవజలము ఇచ్చావు
పాపిని ప్రేమించే ఏసునాధా
పాపినై నేను నీముందు వున్నా
పాప విమోచనం కలుగుటకై
నీదరి చేరాను యేసురాజా ||పా|| ||2||