Type Here to Get Search Results !

పలికెను నా మది పరవశమై ( palikenu na madhi paravashamai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పలికెను నా మది పరవశమై 

పాడెను జీవనం పావనమై 

వాక్యమె జీవితమై - జీవ సుధామృతమై 

హల్లేలూయా - హల్లేలూయా హల్లేలు

హల్లేలు హల్లేలూయా ||2|| 


1. ఆదాము పాపశాపమే మరణమును

మనకివ్వగా 

జీవమివ్వ ప్రభుయేసు నరునిగ జన్మించెను 

బాలయేసుని జన్మదినం - శుభకర 

సుందర పర్వదినం ||2||

చేరరే వేడరే స్తుతులర్పించరే

||హల్లేలూయా|| ||పలికెను|| 


2. జీవమిచ్చు ప్రభు పలుకులు ప్రేమతో

ఆలింపగా 

ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశ

రాగముతో 

రెండంచులు గల ఖడ్గములా పదునైన 

ఈ దివ్యవాక్యము ||2|| 

మోదముతో ఆమోదముతో స్వీకరించరే 

||హల్లేలూయా|| ||పలికెను||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section