Lyrics: Fr. Johnson Chettur
Tune: unknown
Music: Kamalakar
Album: నీరాజనం
ప. ప్రేమ సింధు పరమాత్మ నీవని
నా మది పాడెను-దీనబంధు ప్రభు
యేసు నీవని నీ దరి చేరెను
మనసారా నిన్ను కొలిచేము ...
గళమెత్తి నిన్ను పిలిచేము ||2||
నీ వేదం నాదం నినదించే మధురగీతం
1. చీకటి ఎదలో వేకువ కిరణం
ప్రేమే జీవన సందేశం
వేదన తీర్చే మలయ సమీరం
ప్రేమే శాంతికి సోపానం ||2||
నీదు పలుకే నవ జీవం
బాధలన్ని మటుమాయం ||2||
నీ వేదం నాదం వికసించే మందారం ||ప్రే||
2. మమతల నిలయం ఈ శుభచరితం
మానవ చరితకు మణిహారం
నీ మాటే ఒక తీయని మంత్రం
సుధలను చిందే మకరందం
నీదు పలుకే ప్రేమమయం
ఊరటనిచ్చే ఉపదేశం ||2||
నవదీపం జీవం ప్రభుయేసు శుభవేదం ||ప్రే||