Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పంపుము దేవా పరిశుద్దాత్మను
నూతన పరచగ ఈ భూ ముఖమును ||2||
1. సకల చరాచర జీవరాసులు
నిరీక్షించు నీ వరవాహినికై
నీ కుడిహస్తము తెరచియుంచగా
జాలు వారునే జీవధారలు ||2|| ||ప||
2. కాలగమనమున కళాహీనమై
వెలవెలబోయిన నీదు సృష్టిని
నూతన పరచగా పంపుము దేవా
జీవదాతపరిశుద్ధాత్మను ||2|| ||ప||