Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పంచగాయాలలో దాచుకోవయా -
పాపినైన నన్ను ఆదుకోవయా
భయమును బాధను ఒంటరితనమును -
నా నుండి తొలగించి నడుపుమయ్యా
1. మనసునున్న మలినమును తుడిచివేసి -
నాలోని తలంపులను శుద్ధిచేసి
మంచి తనము నాలో యేసు నింపుమయ్యా
2. కనులకున్న చీకటిని కాంతి చేసి -
మోహము మైకపు చూపును శుద్ధిచేసి
నీ వెలుగు నాలో నింపుమయ్యా
3. ఎదలోని కుట్రను తీసివేసి కోప ద్వేషాలను పారద్రోలి
ప్రేమను నాలో యేసు పెంచుమయ్యా
4. కరముకున్న కల్మషమును కడిగివేసి -
గాయపడిన హస్తముతో శుద్ధిచేసి
సేవాభావం యేసు నాలో నింపుమయ్యా
5. దారి తప్పిన నన్ను వెదకి చేరదీసి -
సరియైన మార్గమును నాకు చూపి
నీదు బాటలో నన్ను నడుపుమయ్యా