Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పనికిరాని రాయని పారవేసిన - రాయిని ఎత్తుకొని దీవించి
ఇంటి మూలరాయిగా మార్చిన దేవా
స్తోత్రము స్తోత్రం స్తోత్రం యేసు రాజా -
నే జీవించుటే నీ కృపయేగా ||2||
1 వ చరణం..
మరణింప నీటిలో వదలివేసిన - మోషేను నీవు ఎత్తుకొంటివి
మాటలు రావని పలికిన వ్యక్తితో - మహా జాతిని నడిపించితివి
నాలో నీవు ఉన్నావయ్యా - నీ గొప్ప కార్యములు చేయాలని
నీ కృప ముందు నా భయమ్లె - మాయమగు బుడగలయ్యా llస్తోత్రంll
స్తోత్రం స్తోత్రం యేసురాజా-నే జీవించుటే నీ కృపయేగా ||2||
2 వ చరణం..
పాప భారము మోయలేక - నీ పాదం చేరిన మగ్ధలేనను
ప్రేమతో నీవు క్షమియించి - పుణ్య జీవితం చూపావు
ఎన్నెన్నో కష్టాలు వచ్చినను-నా బ్రతుకును శూన్యం చేయవయ్యా
నారుపోసిన దేవుడా - నీవు నీరుపోయక మానవుగా llస్తోత్రంll