Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పంచగాయములొందిన
ప్రభుని గాంచగ రారండి ||2||
పరితాపమును పొంది
ప్రార్థించగ రారండి
1. శిలువలో వ్రేలాడెడు
శ్రీయేసుని గాంచండి
శిరము పంచుచును మీరు
స్తుతి గానము చేయండి ||2||
సిరి సంపదలను వదలి
శ్రీయేసుని చేరండి ||2||
స్థిర మోక్షరాజ్యమును
పొందగను రారండి ||2||
2. శ్రమలు పొందిన యేసునాధుని
మార్గమే మనదండి
శ్రమియించు వారికెల్ల
శరణమే శ్రీ యేసండి ||2||
శ్రమలలోని మర్మమును
మనకు చూపును యేసండి ||2||
శ్రమలకోర్చి ఆ యేసును
అనుసరించగ రారండి ||ప||