Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రవక్తల వాగ్దానం నెరవేరింది
ప్రభు జనుల నిరీక్షణ ఫలియించింది
దివినేలు మారాజు భువికేతెంచెనని
సురాగ స్వరాల సంతోష గీతాలు
మనసును తాకే... మా మనసును తాకే ||ప్రవక్తల||
1. కన్యక గర్భమున శిశువు పుట్టునని
మన పాపము బాపి రక్షణ ఇచ్చునని
లేఖనాలు పలికే నాధుని జన్మమును ||2||
పరమును వరముగా తరతరములుపంచే...
మా ముద్దు బాలుడితడే... ||ప్రవక్తల||
2. జీవన గమనములో చీకటి బ్రతుకుల్లో
నిట్టూర్పు తుడిచేసి ఓదార్పునిచ్చెనే
చింతలేదు మనకు - చెంత చేరయేసు ||2||
లాలించి పాలించె ముద్దు బాలుడితడే...
మా ముద్దు బాలుడితడే... ||ప్రవక్తల||