Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభువే పుట్టెను మన కొరకు
వేడగ రండి ఓ జనమా
దైవం మనలో నింపుటకు
ఇల కేతెంచెను ఆ దైవం
దివిలో ప్రభునకు మహిమ
భువిలో మనుజకు శాంతి
దివిలో మహిమ భువిలో శాంతి
ఎల్లవేళల ఉండగ ||2|| ||ప్రభువే||
1 వ చరణం..
పరమున ఉన్న మన దైవం
మానవుడై ఇల జన్మించె
రాజుల రాజుగ జన్మించె
శాంతి రాజ్యమును స్ధాపించె
భువిలో శాంతి నెలకొల్ప
వెలసిన యేసుకు వందనం
వందనం వందనం వందనం ||ప్రభువే||
2 వ చరణం..
ఈర్ష్య ద్వేషం తొలగింప
ఇల కేతెంచెను బాలునిగ
మానవ మనుగడ మార్చగను
మరియ తనయుడై ఉదయించె
భువిలో శాంతి నెలకొల్ప
వెలసిన యేసుకు స్తోత్రము
స్తోత్రము స్తోత్రము స్తోత్రము