Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభువా నీరాక కొరకై అనుక్షణము వేచియున్నాము
మాధుర్యమగు కరుణకై నీ పాదముల చెంత చేరియుంటిమి
1. ప్రభువా ప్రభువా పూజ్యుండవులే
మాలో నిలచిన నిత్యత్యాగ శీలుండవులే
మా కొరకై మృతి నొందితివా - మా చేతులను మీకై చాచితిమి ||ప్రభు ||
2. ఓ మా దేవా! ఇదియే మా మొర -
స్వీకరించుము మా జీవితములు
తుదముట్టన్ మా గమ్యము చేరక మునుపే
మము దీవించుము, మము కరుణించుము