Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు యేసుక్రీస్తు జన్మించే
పరిపూర్ణ తేజముతో
లోకానికిదియే పర్వదినం
ఇదియే మహోదయం
పరిశుద్దుడు పరమాత్ముడు-సత్య సంపూర్ణుడై
పరలోక మార్గము చూపుటకు
తన ప్రేమను తెలుపుటకు ||ప్రభుయేసు||
1. పాపులకై పరమును విడచి
నరరూప ధారునిగా
పశువుల శాలలో మరియసుతునిగా
ఆయన పవళించే ||2||
దూతలు తెల్ప - ఆ వార్త విని
ఆ గొర్రెల కాపరులు
అడుగో ప్రభు - అని - కని-ఆరాధించిరి
||ప్రభుయేసు||
2. తూరుపు తారను - కనుగొనిన
ఆ ముగ్గురు జ్ఞానులు
ఓర్పున సాగి - అద్భుత కరుడగు
యేసుని దర్శించి
భక్తితో మ్రొక్కి - కానుకలిచ్చి
బహుసంతోషించగా
మనము-ఇది-విని-ప్రభుని ఆరాధింతుము
||ప్రభుయేసు||