Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 1
ప: పాపిని దేవా ఘోరపాపినిదేవా
మన్నింపుకోర అర్హుడగాను తండ్రి ||2||
దయతోడ మన్నించు ప్రభువా ||2||
1. ఇకముందు ఎన్నడును పాపము చేయనని
పలికాను పలుమార్లు ప్రతిజ్ఞచేస్తూ
మళ్ళీమళ్ళీ జీవించాను నా పాత జీవితం||2|| ||పాపిని ||
2. మనసారా మన్నింపు నే కోరగానే
పొందాను ఎనలేని నీ క్షమను
అయినా అపుడే వైదొలిగాను నీ ప్రేమమార్గం ||2|| ||పాపిని ||