Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసే నా గానం-2
ప. పాపిని దేవా పావన ప్రభువా
పరితాపముతో ప్రాధేయపడితిని ||2||
నీ కరుణ కటాక్షములతో
నను చేర దీసి కాయుము దేవా ||2|| ||పా||
1. లెక్కలేని పాపాలు-ఎన్నెన్నో అన్నింటా
మునిగి నేను కన్నీటితో ||2||
జీవిత గమ్యం కోల్పోయి
నిన్ను కోరి వచ్చాను నీ చెంతకు ||2|| ||పా||
2. తండ్రిని వీడిన వానివలె
నీకు దూరమయ్యాను ప్రభువా ||2||
నీవులేని జీవితం వ్యర్థమని ||2||
క్షమను కోరి చేరాను నీదరికి ||2|| ||పా||