Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాపిని నేను - పరిశుద్దుడా
పరిహరించుమా-పరమేశ్వరా ||2||
పాపము లెన్నో చేసితి దేవా ||2||
పరిహరించుమా పరమేశ్వరా ||2|| ||పాపి||
1. పాపములోనే పుట్టితి నేను .
పాపములోనే పెరిగితి దేవా ||2||
పాపములన్నీ ప్రక్షాళన జేసి ||2||
పరలోక భాగ్యము ఒసగుము దేవా ||2|| ||పాపి||
2. పాపుల కొరకై వచ్చిన దేవా
పరమ వైద్యుడా-నా యేసయ్యా ||2||
పాపాత్ముడను పరమ నీచుడనయ్యా ||2||
పాదాలు కడిగెదన్ బలియైన దేవా ||2|| ||పాపి||