Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: పాపిని నేను పావన ప్రభువా
దోషిని నేను దయగల దేవా
కరుణామయుడా కరుణించరావా
ప్రేమా మయుడా క్షమియించరావా
1. ఆదాము అవ్వలవలె నీ ఆజ్ఞ మీరాను
అవిధేయుడనై నీకు దూరమైనాను ||2||
కయీను వలె నేను కఠినుడనైనాను ||2||
రాతిగుండే నా నుండి తొలగించు దేవా ||2||
ప్రేమ గుండె నాలో నెలకొల్పరావా ||ప్రా||
2. స్వార్థముతో నేను నీ సువార్త మరిచాను
నా సుఖముకోసం చెడు దారి నడిచాను||2||
దుడుకు చిన్న వాడివలె దురితాలు చేసాను ||2||
శాంతి లేదు నాకు నిన్ను చేరు వరకు ||2||
దయచూపి నా పై నీ దరిచేర్చగ రావా ||ప్రా||