Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాపులను ప్రేమించే యేసయ్యా -
నే పాపిగా నీ ముందు నిలిచినానయ్యా
యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా
యేసయ్యా, యేసయ్యా, నా మెస్సయ్యా
1. ఈ లోక జీవితం దాని వైభవం -
గడ్డి పువ్వు వంటిదన్న సత్య మెరుగక
ఆశల సుడిగాలిలో నే చిక్కు కొంటిని -
అలసి సొలసి నీ సన్నిధ చేరితినయ్యా
2. పాపి మగ్దలేనను ప్రేమతో పిలిచి -
పాప విమోచనము నీవు ప్రసాదించగా
పరివర్తన జీవితముతో నీ బిడ్డగ నిలచినట్లు -
నేను కూడ నీ సన్నిధి నిలచితి దేవా