Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరలోక దేవుని పరిశుద్ద విందులో -
పాల్గొనరారే దైవ భక్తులారా
జీవాహారం క్రీస్తు శరీరం -
దివ్యమైన పానమే క్రీస్తు రక్తము
1. దివినుండి దిగివచ్చిన దివ్యాహారం -
పరమ తండ్రి మనకొసగిన పరమ ప్రసాదం
అప్పరూపమైన ఈ యేసు శరీరం -
లోకాన రారండి విశ్వాసముతో
2. లోకమునకు జీవమొసగు జీవాహారం -
లోకొనువాడు ఎన్నడు ఆకలి గొనడు
దేవునితో ఐక్యపరచు యేసు శరీరం -
లోకాన రారండి విశ్వాసముతో