Type Here to Get Search Results !

పరమునుండి ప్రవహించిన ( paramu nundi pravahinchina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరమునుండి ప్రవహించిన 

ప్రభు యేసుని దివ్య ప్రసాదం 

పాప మలినము తొలగించగా 

అరుదెంచిన జీవాహారం ||2|| 

పరగున రారండీ-ఓ ప్రియ జనులారా 

విందును గ్రోలండీ-ప్రియముగ మనసారా 

ఆర్తితోడ క్రీస్తునాధుని శరణు వేడండి ||2|| ||పరము || 


1. ఇస్రాయేలుకు ఎడారిలో

మన్నా నిచ్చెను ప్రభువు 

బండనుండి జలదారలను 

పుట్టింప జేసెను ప్రభువు ||2|| 

మన్నాకంటే మధురమిది 

మానవ పాపము బాపునిది 

మానస చీకటి తొలగించి 

నూతన వెలుగును నింపునిది 

భక్తితోడ-స్వీకరించి 

ప్రభుని దీవెన పొందండి 

పరగున రారండీ-ఓ ప్రియ జనులారా 

విందును గ్రోలండీ-ప్రియముగ మనసారా 

ఆర్తితోడ క్రీస్తునాధుని శరణు వేడండి ||2|| ||పరము || 


2. దీన జనులను దరిచేర్చి

ఆకలి తీర్చెను యేసు 

పామర జనులతో భుజియించి 

ఆనందమొసగెను క్రీస్తు ||2|| 

ద్రాక్షావల్లిని నేనేయని 

మనలను తనలో ఫలించుమని 

జీవజలమును సేవింప 

జీవ మార్గమును చూపెనుగా 

హృదిని తెరిచి... ప్రభుని పిలిచి... 

హృదయకాంతిని పొందండి 

పరగున రారండీ-ఓ ప్రియ జనులారా 

విందును గ్రోలండీ-ప్రియముగ మనసారా 

ఆర్తితోడ క్రీస్తునాధుని శరణు వేడండి ||2|| ||పరము || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section